
-
ప్రధాని నరేంద్ర మోదీ
కాన్పుర్: సాంకేతిక ప్రపంచానికి ఐఐటీ కాన్పూర్ వెలకట్టలేని బహుమతలను అందజేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు తనకు రెట్టింపు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు కాన్పూర్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.. సాంకేతిక రంగంలో ఐఐటీ వెలకట్టలేనిదిగా మారుతోందని వ్యాఖ్యానించారు.
ఉత్తర్ప్రదేశ్లో ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఐఐటీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ క్రమంలో మాట్లాడిన మోదీ.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటీ కాన్పూర్ కు రాకముందు విద్యార్థుల్లో తెలియని భయం ఉండేది.. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని జయించగలమే నమ్మకం, ఏదైనా సాధించగలమే ధైర్యం, విశ్వాసం పెరిగిందన్నారు. దేశం మరో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోదని .. సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Source: EtvBharat