News

తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల అప్ర‌మ‌త్తం

379views

రాయ్‌పూర్‌: తెలంగాణ-ఛత్తీస్​గఢ్ స‌రిహ‌ద్దుల్లో సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఏవోబీలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్పుల సంఘటన నుంచి మావోయిస్టు నాయ‌కులు త‌ప్పించుకుని ఏవోబీలోకి ప్ర‌వేశించిన‌ట్టు నిఘా వ‌ర్గాలకు స‌మాచారం అంద‌డంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలను అణువణువునా ప‌రిశీలిస్తున్నారు.

ఈ మేరకు గ్రేహౌండ్స్, ప్ర‌త్యేక పార్టీ పోలీసు బ‌ల‌గాలు రంగలోకి దిగాయి. ఒడిశాలోని డీవీఎఫ్, ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ బ‌ల‌గాల‌తో అట‌వీ ప్రాంతంలో వెదుకుతున్నారు. దీనికి తోడు ఏవోబీలో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంప్‌ స్వాధీనం చేసుకోవడంతో పాటు మావోయిస్టుల కార్యకలాపాలు విస్తృతం చేసే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో స‌రిహద్దు కూడ‌లి గ్రామాల్లో విస్తృత గాలింపు నిర్వ‌హిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి