
1kviews
నంద్యాల: నంద్యాల జిల్లా గోస్పాడు మండలం, యాలూరులోని ఆది జాంబవ కాలనీలో హిందూ సమ్మేళనం ఈ నెల 24న జరిగింది. ప్రధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్ కర్నూల్ విభాగ్ కార్యకారిణి డాక్టర్ ఉదయ శంకర్ పాల్గొని, మాట్లాడారు. హిందూ మతం గొప్పతనం, హిందూమతంలో ఆది జాంబవుల గొప్పతనం, దేశ విదేశాల్లో హిందూ మతం ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న, ఎదుర్కోబోతున్న సమస్యలను వివరించారు.
ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పునర్వైభవస్థితికి చేర్చటానికి మనందరం కులాలను ప్రక్కన బెట్టి, సంఘటితమై పోరాడవలసిన అవసరాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ విభాగ ప్రముఖ్ శ్యామ్ ప్రసాద్, నంద్యాల జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ చంద్రశేఖర ప్రసాద్, రామ నరసింహ, బాబు, గోపి, మధు, గ్రామస్తులు పాల్గొన్నారు.





