
752views
అంతర్వేది: తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నారసింహస్వామిని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకారు. మోహన్ భగవత్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ చరిత్ర, విశిష్టతను గురించి వివరించారు. తర్వాత వేదాశీర్వనాలు అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను ఇచ్చారు. దర్శనానంతరం మోహన్ భగవత్ సత్యనారాయణరాజుపురంలోని అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, ఆయన ప్రయాణించే రహదారిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





