422
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 250కి చేరువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బుధవారం నాటికి 213 మందికి ఒమిక్రాన్ సోకినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 15 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగుచూసినట్టు పేర్కొంది.