
547views
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు, సహా పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున చిక్కబల్లపుర జిల్లా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించాయి.
ఈ మేరకు కర్ణాటక విపత్తు శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించాయి. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని ఎన్సీఎస్ వెల్లడించింది. బుధవారం ఉదయం 7.09 గంటలకు ప్రకంపనలు సంభవించినట్టు తెలిపింది. భూకంప కేంద్రం ఈశాన్య బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో భూమికి 11 కిలోమీటర్ల లోతున ఉందని పేర్కొంది.
Source: Tv9





