News

ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి

329views
  • హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను తెలుగులో నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. అధికార భాష పర్యవేక్షణ అధికారులను నియమించాలని, వారు ప్రతి నెల అయిదోతేదీ లోపు నివేదికను సమర్పించేలా ఆదేశించాలన్నారు. 2017లో తీసుకొచ్చిన ఏపీ పర్యాటక , సంస్కృతి చట్టానికి అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులో నిర్వహించని అధికారులకు తెలుగు భాషాభివృద్ధి సంస్థ నిబంధన 10 ప్రకారం జరిమానా విధించేలా ఉత్తర్వులివ్వాలన్నారు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ యువత అభివృద్ధి , పర్యాటక , సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి