News

స్వర్ణ దేవాలయంలోకి ఆగంతకుడు.. కొట్టి చంపిన భక్తులు!

576views

అమృత‌స‌ర్‌: అమృస‌ర్‌లోని స్వర్ణ మందిరంలోకి ఓ ఆగంత‌కుడు చొర‌బ‌డ్డాడు. అక్కడున్న కత్తిని తీసుకుని గురుగ్రంథ్‌ సాహిబ్‌ వైపు వెళ్లాడు. ఈ క్రమంలో ఆగంతుకుడిని శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ టాస్క్​ఫోర్స్​ సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై భక్తులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మృతిచెందాడు.

ఈ మేర‌కు అమృత్​సర్​ డీసీపీ పరమీందర్ సింగ్ బందాల్​ తెలిపారు. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. మృతదేహాన్ని అమృతసర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారిస్తున్నారు. పవిత్రమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌ పుస్తకం సురక్షితంగానే ఉందని దానిని ఎవరూ పట్టుకోలేదని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి