News

లింగాపురంలో గీత జయంతి ఉత్సవం

448views

బండి ఆత్మకూరు: గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, క‌ర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం, లింగాపురం గ్రామంలో గీతా జయంతి ఘ‌నంగా జరిగింది. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం చేశారు. వెలుగోడు కండ ప్రముఖ్‌ కొండా రెడ్డి, సంజన నేతృత్వం వహించారు.

విభాగ్ ధర్మజాగరణ ప్రముఖ్‌ రాంప్రసాద్, జిల్లా ధర్మ జాగరణ ప్రముక్ చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం చేసిన గురువు వెంకటేశ్వర రెడ్డి నూతన వస్త్రాలు ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో లింగాల గ్రామంలోని హిందూ బంధువులు, మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, హిందూ ధర్మం పట్ల తమ నిబద్ధతను చాటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి