460
వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోడీ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వ్యక్తికి కేరళ హైకోర్టు అక్షింతలు
కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. స్పందించిన కోర్టు ‘ఆయన మన ప్రధానమంత్రి. మరే ఇతర దేశానికో ప్రధాని కాదు. మీకు రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన.. ఇలాంటి అభ్యంతరాలు సరికాదు. మన ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు న్యాయస్థానం సమయాన్ని వృథా చేస్తున్నారు’ అని కోర్టు పేర్కొంది.