
519views
చియాపాస్: మెక్సికోలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని టక్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్రమాదం జరిగింది. మెక్సికో నుంచి వలస కూలీలు అమెరికా సరిహద్దుల వైపునకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ట్రక్కు పరిమితికి మించి బరువు ఉండడం, దాన్ని డ్రైవర్ వేగంగా నడపడం వల్లే అది ఒక్కసారిగా బోల్తా పడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రక్కులో చిన్నారులు కూడా ఉన్నారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందేలా చేస్తున్నాయి. మెక్సికో నుంచి అమెరికాకు చట్ట విరుద్ధంగా వలసలు వెళ్లే క్రమంలో కార్మికులు పదే పదే ప్రమాదాలకు గురవుతున్నారు.
Source: NationalistHub





