
567views
-
హెలికాఫ్టర్ కూలిన ఘటనపై సంయుక్త దర్యాప్తునకు ఆదేశం
-
పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన
న్యూఢిల్లీ: బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాద ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్టు రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో వెల్లడించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. విచారణ బృందం ఇప్పటికే వెల్లింగ్టన్కు చేరుకుందని.. దర్యాప్తు ప్రారంభమైందని వివరించారు. రాజ్నాథ్ ప్రకటన అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించారు. కూనూర్ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు.





