News

నెల్లూరు, కడప జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు

94views

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, చెజర్ల, సంగం, ఏయస్ పేట మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవాహిస్తుండగా..ఈ వర్షాలకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండ‌గా, కడపలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. పది రోజుల కిందట కురిసిన భారీ వర్షం నుంచి నగరవాసులు కోలుకోక మునుపే…మళ్లీ వర్షాలు పడటం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండు కుండలా మారాయి. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి