
తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వచ్చే నెల డిసెంబర్‌లో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలను దేవస్థానం అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుండి 2022, ఫిబ్రవరి 28వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఋగ్వేద పారాయణం. రెండోతేదీన ధన్వంతరి జయంతి. నాలుగున శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనసేవ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పౌర్ణమి గరుడసేవ కాసులమాల ఊరేగింపు.
ఎనిమిదోతేదీన పంచమీ తీర్థం సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి పడి ఊరేగింపు. 12న కార్తీక మాసం చివరి ఆదివారం శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం. 14న గీతాజయంతి. 15న చక్రతీర్థ ముక్కోటి. 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం. 18న దత్త జయంతి. 19న పౌర్ణమి గరుడసేవ.
Source: TTTD NEWS





