News

మ‌త‌మార్పిడితో దేశానికి ముప్పు!

545views
  • శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి

విశాఖ‌ప‌ట్నం: త్రిపుర రాష్ట్రం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం శ్రీ త్రిపుర బగలాపతి పీఠాధిపతి కపిలేశ్వరానంద గిరి స్వామి స్థానిక మ‌త్స్య‌కార గ్రామం జాలారిపేట‌ను గురువారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌త్స్య‌కారుల‌కు హిందూ ధర్మంపై ప్రబోధన చేశారు. ఈ కార్య‌క్ర‌మం విశాఖ సీటీ మత్స్య కార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జ‌రిగింది. మత మార్పిడులు వలన హిందూ సమాజానికి, దేశానికి జరిగే నష్టాన్ని గ్రామస్థులకు స్వామి వివ‌రించారు. చ‌ట్ట వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న మతమార్పిడులు దేశానికి తీర‌ని హాని క‌లిగిస్తాయ‌ని హెచ్చ‌రించారు.

ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంగేయుల సుబ్రహ్మణ్యం, మత్స్య కార సంక్షేమ సమితి విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి మహేష్ , దేవాలయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కురందాసు మల్లయ్య, కార్యదర్శి గుంటు సత్తియ్య , బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ వాసుపల్లి దానయ్య, ఈస్ట్ కన్వినర్ సుబ్రహ్మణ్యం, గ్రామ కులపెద్దలు తెడ్డు పరసన్న ఒలిసెట్టి తాతలు, ఆర్‌.ఎస్.ఎస్‌ నగర ధర్మ జాగరణ ప్రముఖ ఓలిసెట్టి జోగారావు, జిల్లా కార్య వర్గ సభ్యులు, మండల కార్య వర్గ సభ్యులు, గ్రామ కార్య వర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి