News

తిరుమల ఘాట్ రోడ్‌లో కొండచరియలు విరిగి పడకుండా చర్యలు

682views

తిరుప‌తి: తిరుమలలో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం పర్యటించింది. తిరుమలలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్లతో పాటూ.. కొండపైన పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు పడిన ప్రాంతాలు, రహదారులు దెబ్బతిన్న ప్రదేశాలను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం సభ్యులు తనిఖీ చేశారు. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనల కోసం ఐఐటీ నిపుణులను తితిదే ఆహ్వానించింది. నిపుణుల నివేదిక మేరకు తితిదే చర్యలు చేపట్టనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి