News

ఆసియా బ్యాంక్ నుంచి రుణం తీసుకోనున్న‌ భారత్

38views
  • ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు వినియోగం

న్యూఢిల్లీ: భారత్​లోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, ఆసియా డెవ‌లప్​మెంట్​ బ్యాంక్​ నుంచి సుమారు 300 బిలియన్​ డాలర్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 13 రాష్ట్రాల్లోని వివిధ పట్టణ ప్రాంతాల్లోని 51 లక్షల మురికివాడల్లో నివసించే సుమారు 2 కోట్ల 56 లక్ష మంది లబ్ధిపొందనున్నారు.

ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి రజాత్​ కుమార్​ మిశ్రా భారత్​ నుంచి, ఏడీబీ నుంచి టాకియో కొనిషిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ రుణం పట్టణ ప్రాంతాల్లో ఉండే జనాభాకు మెరుగైన వైద్యసేవలను అందించడానికి ఉపయోగపడుతుందని మిశ్రా అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ అండ్​ వెల్​నెస్​ సెంటర్స్​, ప్రధాన మంత్రి ఆత్మనిర్భర భారత్ యోజన, ప్రధాన మంత్రి ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మిషన్​ లాంటి కార్యక్రమాలకు ఈ మొత్తం దన్నుగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి