News

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత ఆపన్న హస్తం

398views
  • 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సరఫరా

  • తమ దేశం మీదుగా రవాణాకు పాక్ అంగీకారం

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్​కు సహాయంగా భారత్​ ప్రకటించిన 50వేల మెట్రిక్​ టన్నుల గోధుములను పాకిస్థాన్​ మీదుగా తరలించేందుకు ఆ దేశం అంగీకరించింది. ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్​లో సోమవారం నిర్వహించిన సమావేశంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రవాణా విధివిధానాలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్థాన్​ను ఆదుకోవడం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు.
గతనెల భారత్​.. అఫ్గానిస్థాన్​కు 50వేల మెట్రిక్​ టన్నుల గోధుమలను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీటిని వాఘ సరిహద్దు మీదుగా తరలించేందుకు అనుమతించాలని పాక్​ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం అఫ్గాన్​ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులనే తమ దేశం మీదుగా తరలించేందుకు పాకిస్థాన్​ అనుమతిస్తోంది. భారత్ నుంచి పంపిణీపై గతకొంత కాలంగా నిషేధం విధించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి