News

23 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

558views

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది. కొవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్‌ సమావేశాలు, వర్షాకాల సమావేశాలనూ కుదించారు. ఈ దఫా పార్లమెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి