News

టిక్‌టాక్‌తో ఉగ్రవాదం వ్యాప్తి!

574views
  • కొత్త పంథాలో ఐఎస్‌ఐఎస్‌

న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ఆత్మాహుతి బాంబర్లతో భీకరంగా ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌ఐఎస్‌) ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ను ఉపయోగిస్తున్నట్టు క‌నుగొన్నారు. ది యుఎస్ స‌న్‌ అనే న్యూస్‌ వైబ్‌సైట్‌లో వెలువడిన సమాచారం ప్రకారం.. ఈ ప్లాట్‌ఫారమ్‌లో డజన్ల కొద్దీ ఖాతాలు సృష్టించిన ఐఎస్‌ఐఎస్‌.. తన ప్రచార నిమిత్తం పోస్టు చేస్తోంది.

ముస్లిమేతరుల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు టిక్‌టాక్‌ను ఉపయోగించుకుంటుంది. ఒకేసారి అత్యధికస్థాయిలో ప్రాణనష్టం జరిగేలా పాశ్చాత్య దేశాలలో క్రిస్మస్‌ సెలవుల్లో తీవ్రవాద దాడులను ప్రారంభించాలని ఒక వీడియోలో పిలుపునిచ్చింది. ఆ వీడియోలో క్రిస్మస్‌ను ‘కుఫర్‌, క్రూసేడర్‌ల వేడుక’గా అభివర్ణించింది. అందులో, ‘వారు అల్లాను విశ్వసించరు, వారు పవిత్రమైన వాటిని ఎగతాళి చేస్తారు. వారు షైతాన్‌(దెయ్యం) బానిసలు… ‘ఓ అల్లా సైనికా, ఈ కుఫర్ల రక్తాన్ని చిందించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.’ అంటూ పిలుపునిచ్చినట్టు ఉంది. ఈ వీడియోలో క్రిస్మస్‌ మార్కెట్లు, వేడుకల దృశ్యాలను చూపిస్తూ పై మాటలను జోడించి ఉంది.

ప్రచారానికి ఉపయోగపడే ఖాతాలో వీడియో అప్‌లోడ్‌ చేసినట్టు సన్‌ సమాచారం పేర్కొంది. ఈ ఖాతా 18 నెలలుగా పనిచేస్తోంది. వేలాది మంది ఈ వీడియోను వీక్షించివున్నారు. ఈ ఖాతా మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది షార్ట్‌-వీడియో ప్లాట్‌ఫారమ్‌లో కూడా అదే పనిచేస్తున్నట్టు కనుగొన్నారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.