News

3 రాజధానుల బిల్లుపై వెనక్కి…

582views
  • ఏపీ సర్కారు కీలక నిర్ణయం

విజయవాడ: మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు స్పీకర్‌ అనుమతివ్వడంతో బుగ్గన ఈ విషయాన్ని సభలో తెలిపారు.

కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. మొదటి నుంచి అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇది అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజల విజయమన్నారు. అలాగే, కర్నూలులో హైకోర్టు కట్టాలని మా డిక్లరేషన్‌లో ఉందని గుర్తు చేసిన వీర్రాజు.. రాయలసీమ డిక్లరేషన్‌పై కట్టుబడి ఉన్నామన్నారు. రాయలసీమలో వైసీపీ నాయకులకు నోరుమెదిపే ధైర్యంలేదన్నారు. వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని సోము వీర్రాజు భరోసా ఇచ్చారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.