343
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికి జరిగిన ఎన్నికల్లో 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్‌లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హర్షం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి బృందాన్ని ప్రశంసించారు.
భారత్ అభ్యర్థిత్వానికి కృషి చేసిన దేశాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐరాస సాంస్కృతిక విభాగమైన యునెస్కోలో భారత్ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డుకు గ్రూప్ నాలుగు ఆసియా, పసిఫిక్ స్టేట్స్‌లో జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, కుక్ ఐలాండ్స్, చైనా కూడా ఎన్నికయ్యాయి.