News

బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్‌కు అమెరికా డౌటే!

474views
  • చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపణ

వాషింగ్ట‌న్‌: 2022లో చైనాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్​ను బహిష్కరించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికాలోని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అందుకే బీజింగ్​ ఒలింపిక్స్​ను అమెరికా బహిష్కరించాలని రిపబ్లికన్​ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శీతాకాల ఒలింపిక్స్‌ను కమ్యూనిస్ట్ అజెండా ప్రచారానికి డ్రాగన్ వాడుకుంటుందని రిపబ్లికన్ ముఖ్యనేత ఇండో అమెరికన్ నిక్కీ హేలీ గతంలో ఆరోపించారు. వింటర్ ఒలింపిక్స్ మాటున మానవహక్కుల ఉల్లంఘనను చైనా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి