
617views
-
117 ఛలానాలు ఉన్నా రోడ్లపై దర్జాగా రాకపోకలు
భాగ్యనగరం: హైదరాబాద్‌లోని నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మహ్మద్ ఫరీద్ ఖాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. మహ్మద్ ఫరీద్ ఖాన్ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్ గల హోండా యాక్టివాపై ఉన్న చలాన్లు చూసి పోలీసులే షాక్ అయ్యారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.

ఈ క్రమంలో ఫరీద్.. వాహనాన్ని ఆపి చెక్ చేయగా 117 చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. రూ.30వేల రూపాయలు అతడు ఫైన్స్ చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో అతడి వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. పెండిరగ్‌లో ఉన్న చలాన్‌లు చెల్లించిన తర్వాత బైక్‌ను తీసుకోవాలని ఫరీద్‌ఖాన్‌కు చెప్పారు.
Source: NationalistHub





