News

కాశీ విశ్వనాథ ఆలయంలో 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్టించిన యోగి ఆదిత్యనాథ్

676views

త్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం (నవంబర్ 15) వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మాతా అన్నపూర్ణ దేవి యొక్క అరుదైన విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం వారణాసి నుండి దొంగిలించబడిన 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం ఇటీవల కెనడా నుండి తిరిగొచ్చింది.

ప్రధాని నరేంద్రమోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. 108 ఏళ్ల తర్వాత అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం మరోసారి కాశీకి చేరుకుందని, ఆ ఘనత కాశీ ఎంపీ, ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని, ఆయనకు కాశీ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని యోగి అన్నారు.

అంతకుముందు నవంబర్ 11 న, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రోచ్ఛారణల మధ్య మతపరమైన వేడుక తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నుండి ఆ పురాతన రాతి విగ్రహాన్ని స్వీకరించారు.

మాతా అన్నపూర్ణేశ్వరి విగ్రహం వారణాసి రాకతో నాలుగు రోజుల పాటు సాగిన ‘శోభా యాత్ర’ ఆదివారం రాత్రి ముగిసింది.

యాత్ర సమయంలో, మా అన్నపూర్ణ విగ్రహం తుది గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందు కస్గంజ్, కాన్పూర్, అయోధ్యతో సహా పలు ప్రదేశాలలో అభిమానులు ఘన స్వాగతం పలికారు.

విగ్రహం ఎత్తు 17 సెం.మీ, వెడల్పు 9 సెం.మీ, మందం 4 సెం.మీ.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు 42 అరుదైన వారసత్వ కళాఖండాలు దేశానికి తిరిగొచ్చాయని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. అయితే 1976 మరియు 2013 మధ్య, కేవలం 13 అరుదైన విగ్రహాలు మరియు పెయింటింగ్‌లను మాత్రమే అప్పటి ప్రభుత్వాలు భారతదేశానికి తీసుకురాగలిగిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రస్తుతం విదేశాల్లో 157 శిల్పాలు, చిత్రాలను గుర్తించారు. వాటిని భారత్ ‌కు రప్పించేందుకు పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. సింగపూర్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, బెల్జియం దేశాల నుంచి విగ్రహాలను తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా నుంచి దాదాపు 100 విగ్రహాల వెనక్కి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాతా అన్న పూర్ణేశ్వరిని ఆహారం మరియు పోషణకు సంబంధించిన దేవతగా భావిస్తారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.