
-
మాట నిలబెట్టుకుంటున్న మోదీ!
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ఎన్నో పురాతన విగ్రహాలు ఇతర దేశాలకు అక్రమంగా రవాణా అయిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి విగ్రహాలను తిరిగి భారత్‌కు తెప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను తెస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో పురాతన విగ్రహం కూడా భారత్‌కు చేరుకుంది. పవిత్ర కాశీ నుంచి దాదాపు 100 ఏళ్ళ కింట చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి పూజలందుకోనుంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం కెనడా చేరింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాన్ని తీసుకునివచ్చింది. పునర్నిర్మాణం జరుపుకుంటూ కొత్తగా ముస్తాబవుతున్న విశ్వనాథాలయ ప్రాంగణంలో నవంబర్ 15న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం ఫలితంగానే ఈ విగ్రహాన్ని భారత్‌కు కెనడా తిరిగిచ్చిందని డివిజనల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ తెలిపారు. రోడ్డు మార్గంలో విగ్రహాన్ని ఢిల్లీ నుంచి కాశీకి తరలించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ రాత్రికల్లా యాత్ర కాశీ చేరుతుంది. విశ్వనాథ్ ధామ్‌లో 15న విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ జరుగుతాయని అధికారులు తెలిపారు. అన్నపూర్ణ దేవత విగ్రహాన్ని కెనడా నుంచి తెప్పిస్తున్నట్టు గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కాగా, పీబాడీ ఎసెక్స్ మ్యూజియంలోని భారతీయ, దక్షిణాసియా కళల క్యూరేటర్ డాక్టర్ సిద్ధార్థ షా ఈ విగ్రహాన్ని గుర్తించారు.
Source: NationalistHub





