News

2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక క్షేత్రంగా అయోధ్య

616views

ల‌క్నో: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవంలో ఆయన ప్రసంగించారు. రామ మందిర నిర్మాణంతో ఏటా 5 కోట్ల మంది పర్యాటకులు అయోధ్య వస్తారని అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో ప్రజలు రామాలయాన్ని సందర్శిస్తారన్నారు.

అయోధ్యలో రైలు, రహదారి కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపడతామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించనున్నట్టు వివరించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినప్పుడు అది ప్రపంచంలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటిగా, భారతదేశ సాంస్కృతిక రాజధానిగా మారుతుందని అన్నారు. దీపావళి సందర్భంగా ఇటీవల సరయు నది ఒడ్డున 9.5 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి