
-
వ్యతిరేకించిన ముస్లిం ఛాందసవాదులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు పునర్‌నిర్మించిన ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి, హిందువులకు తాను ఏం చేసినా అది న్యాయమూర్తిగా తన బాధ్యత అని అన్నారు. హిందూ సన్యాసి శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ చారిత్రాత్మక సమాధి వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు జస్టిస్ అహ్మద్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లా తేరి గ్రామానికి వెళ్ళారు.
ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినప్పటికీ, డిసెంబర్ 2020లో స్థానికులు కొందరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని జస్టిస్ అహ్మద్ ఆదేశించారు. కాగా ముస్లిం ఛాందసవాదులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టీ ముస్లింల సమస్యలను ముందుగా పరిష్కరించి, ఆ తరువాతే మైనారిటీల సమస్యలను పట్టించుకోవాలని వాదిస్తున్నారు.





