News

శ్రీనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

279views

శ్రీ‌న‌గ‌ర్‌: శ్రీనగర్‌కు సృజనాత్మక నగరంగా యునెస్కో ఎంపిక చేసింది. హస్తకళలు, జానపద కళల విభాగంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ శ్రీనగర్‌కు చోటుకల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో మొత్తం 90 దేశాల్లో 295 నగరాలు ఉన్నాయి. శ్రీనగర్‌తో పాటు గ్వాలియర్‌ను కూడా ఈ జాబితాలో చేర్చాలని గతంలో యునెస్కోకు భారత్ సిఫార్సు చేసింది. కానీ.. శ్రీనగర్‌కే అవకాశం క్రియేటివ్ సిటీస్‌లో చోటుకల్పిస్తూ.. యునెస్కో ప్రకటన చేసింది. కాగా.. యునెస్కో 2019లో హైదరాబాద్‌, ముంబై నగరాలను క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.

అందమైన శ్రీనగర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఆనందంగా ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ లో హస్తకళలు, జానపద కళలకు ప్రసిద్ధిగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది శ్రీనగర్ సాంస్కృతిక చరిత్రకు తగిన గుర్తింపు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అభినందనలు.. అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి