News

అమెరికా – చైనా మధ్య ముదురుతున్న వివాదం

571views
  • సైన్యాన్ని ఆధునీక‌రిస్తున్న‌ చైనా

  • శాటిలైట్ చిత్రాలతో వెల్లడైన వాస్తవాలు

న్యూఢిల్లీ: చైనా-అమెరికాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. సైనిక వివాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైనా ప్రయత్నాలు ఉద్రిక్తతలు పెంచే దిశలో సాగుతున్నాయి. అమెరికా నౌకాదళాన్ని, ముఖ్యంగా వారి యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు తన ఎడారి ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకలు, డిస్ట్రాయర్ల నమూనాలను చైనా తయారు చేసింది. ఈ విధంగా చైనా యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. చైనా ప్రణాళికను అమెరికాలోని శాటిలైట్ ఇమేజ్ ప్రొవైడర్.. మాక్సర్ టెక్నాలజీ వెల్లడించింది. కొన్ని శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. అమెరికా నౌకాదళాన్ని ఢీకొట్టేందుకు ఇప్పుడు చైనా ఎలాంటి సన్నాహాలు చేస్తుందో ఇవి స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి