Newsvideos

మా ఇళ్ల మధ్యన మసీదు – మాకొద్దు మాకొద్దు అంటున్న గ్రామస్తులు

1.1kviews

ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించ తలపెట్టిన మసీదు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

విశాఖ జిల్లా, పెందుర్తి ఆశ్రమం అధిపతి భారతీనంద స్వామీజీ ఆధ్వర్యంలో బొండపల్లిలోని తహసీల్దార్ కార్యాలయానికి ఊరేగింపుగా వచ్చి, ఎలాంటి అనుమతులూ లేకుండా, అక్రమంగా, ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న మసీదు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ ను డిమాండ్ చేశారు. ” గొట్లాం గ్రామంలో మసీదు నిర్మాణం – ఆపుచేయాలి ఆపుచేయాలి”, “మా ఇళ్ల మధ్యన మసీదు – మాకొద్దు మాకొద్దు”, “గవర్నమెంట్ స్థలాన్ని – కాపాడుకుందాం కాపాడుకుందాం”, “జైశ్రీరాం” నినాదాలతో గ్రామస్తులు గర్జించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.