News

కెప్టెన్ గా అభినందన్‌ వర్థమాన్

291views

భినందన్‌ వర్థమాన్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం వింగ్ కమాండర్‌గా ఉన్న ఆయనను గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానిక దళం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కల్నల్ ర్యాంకుతో సమానం. పుల్వామాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి అనంతరం భారత సైన్యం బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి ఉగ్రవాదులను హతమార్చింది. అప్పుడు పాకిస్తాన్ 27 ఫిబ్రవరి 2019న ఎఫ్-16 యుద్ధ విమానంతో భారత్‌పైకి దాడికి యత్నించింది. పాక్ ప్రయత్నాన్ని భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మిగ్-21 విమానంతో ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానమైన ఎఫ్-16ను వెంటాడి నేల కూల్చారు. ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో తప్పించుకోగలిగారు. పాక్ భూభాగంలో దిగడంతో కొందరు ఆయనను కొట్టి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అప్పుడు భారత ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి అభినందన్ ‌ను విడిచిపెట్టేలా చేసింది. భారత్ ‌కు తిరిగొచ్చిన అభినందన్ కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్ ‌కు 2019లో ‘వీర్ చక్ర’ అవార్డును ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు వాయుసేన ఆయనను గ్రూప్ కెప్టెన్ ‌గా నియమించింది.

Source : Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.