
న్యూఢిల్లీ: ప్రపంచంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదంలో గాయపడి అవయవాలు కోల్పోతున్నవారు, మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రమాదాల బారినపడిన క్షతగాత్రులు ప్రతి నాలుగు నిమిషాల్లో ఒకరు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారి భద్రతా కోసం కొన్ని రూల్స్‌ను రూపొందించింది. ముఖ్యంగా మోటార్ బైక్స్‌పై ప్రయాణించే వాహనదారులకు హల్మెట్‌ను ధరించడం తప్పని సరిచేసింది. రూల్స్‌ని అతిక్రమించినవారికి జరిమానాలు వేసినా వాహనదారుల్లో నిర్లక్ష్యం పోవడంలేదు.
ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హెల్మెట్ కొంటే బీమా పాలసీ ఉచితం అంటూ ప్రకటించింది ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. వేగా హెల్మెట్‌లతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన పెంచడానికి సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. వాహనదారులలో రక్షణ అలవాటును పెంపొందించడానికి వేగా హెల్మెట్ ప్రతి ఆన్‌లైన్ కొనుగోలుపై వ్యక్తిగత ప్రమాద పాలసీని అందించడానికి సహకరించింది. టూవీలర్ వాహనదారుల వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీగా రూ.లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ప్రకటించింది. హెల్మెట్ కొన్నవారికి బీమా సౌకర్యం కల్పించడం దేశంలో ఇదే మొదటిసారి.
Source: Tv9





