
646views
ఇటలీ: ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాన మంత్రి మారియో డ్రాగితో తొలిసారి ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ పర్యటన మోడీ చేపట్టారు. శనివారం ఉదయం ఇటలీ చేరుకున్న ఆయనకు రోమ్‌లోని ఇటలీ ప్రధానమంత్రి కార్యాలయం ప్లాజో చిగిలో డ్రాగి స్వాగతం పలికారు. అక్కడ మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా తెలిపారు. జీ20 సమావేశం అనంతరం బ్రిటన్‌లోని గ్లాస్గోలో జరగనున్న కాప్26 ప్రపంచ నేతల సదస్సులోనూ మోదీ పాల్గొనున్నారు.





