News

బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ప్రకటన అబద్ధం

796views
  • ‘ఏ దేవాలయాన్ని ధ్వంసం చేయలేదు’ అనే ప్రకటనపై నిందించిన ఇస్కాన్‌

ప్రయాగ్‌రాజ్‌: బంగ్లాదేశ్‌లో ఏ ఒక్క దేవాలయాన్ని కూడా ధ్వంసం చేయలేదని, ఎవరూ అత్యాచారం చేయలేదని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎకె అబ్దుల్‌ మోమెన్‌ చేసిన ప్రకటనను నిదిస్తూ, ఇస్కాన్‌ ప్రయాగ్‌రాజ్‌ శాఖ.. ఇది పూర్తి అబద్ధమని, ‘ఇక్కడ భారతదేశంలో మన గొంతులను బలోపేతం చేయాలి’ అని పిలుపునిచ్చింది.

‘బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ప్రకటన పూర్తిగా అబద్ధం. హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి, అక్కడి మీడియా కూడా దాని గురించి నివేదించింది. ఈ వికృత చేష్టలపై కఠిన చర్యకు డిమాండ్‌ చేసే వాయిస్‌ ఇక్కడ బలంగా ఉంది అనే సందేశం వారికి వచ్చేలా మనం మన గొంతును బలోపేతం చేయాలి.. కానీ ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు’ అని ఇస్కాన్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ ప్రయాగ్‌రాజ్‌ వేణు విజయ్‌ దాస్‌ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి గురువారం మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన మత హింసలో ఒక్క దేవాలయం కూడా ధ్వంసం కాలేదు… ప్రచారాలన్నీ అబద్ధమని, ఆరుగురే మరణించారు. వారిలో నలుగురు ముస్లింలు. అది కూడా పోలీసు ఎన్‌కౌంటర్లలో మరణించారు. ఇద్దరు హిందువులు, వారిలో ఒకరిది సాధారణ మరణం, మరొకరు చెరువులో దూకినప్పుడు మరణించారు… ఎవరూ అత్యాచారానికి గురికాలేదు…, ఒక్క మందిరాన్ని కూడా ధ్వంసం చేయలేదు. అయినప్పటికీ, దేవతా విగ్రహాలు విధ్వంసానికి గురయ్యాయి’ అని తెలిపారు.

బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై దాడి, ఇస్కాన్‌ దేవాలయాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణ కాన్షియస్‌నెస్‌(ఇస్కాన్‌) దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు నిర్వహిస్తోంది. కాగా, మంత్రి ప్రకటనను ఇస్కాన్‌ ఖండించింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి