
455views
-
మొన్న అగ్ని 5.. నేడు లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం
న్యూఢిల్లీ: భారత పరిశోధకులు డ్రాగన్ కంట్రీ చైనా గుండెళ్లో గుబులు పుట్టిస్తున్నారు. తాజాగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) జరిపిన లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో ఇక చైనా నిద్రలేని రాత్రులు గడుపుతుందని భారతీయులు వ్యాఖ్యానిస్తున్నారు. డీఆర్‌డీఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్-రేంజ్ బాంబును శుక్రవారం ఏరియల్ ప్లాట్‌ఫారమ్ నుండి విజయవంతంగా పరీక్షించారు.
భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నుండి సుదూర శ్రేణి వార్‌హెడ్‌ను ప్రయోగించిన తర్వాత నిర్దిష్ట పరిధులలో ఖచ్చితత్వంతో సుదూర శ్రేణిలో భూ-ఆధారిత లక్ష్యానికి నిర్దేశించబడిందని బృందం పేర్కొంది. అలాగే మిషన్ లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
Source: Tv9
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.