
116views
-
తాలిబాన్లకు ఆర్థిక సాయం చేయాలని పిలుపు
-
మరోసారి ఉగ్రవాదానికి మద్దతు
ఖతార్: అఫ్ఘానిస్తాన్ పూర్తిగా ఆర్థికమాంద్యంలో కూరుకుపోయిందని, తాలిబన్లను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని చైనా, పాకిస్తాన్ దేశాల అధినేతలు మంగళవారం పిలుపునిచ్చారు. అఫ్ఘాన్ ప్రజలు ఆహారం, మందులు లేక అలమటిస్తున్నారని, చలికాలం రాబోతున్న దృష్ట్యా వారి కష్టాలు మరింత తీవ్రంగా ఉంటాయని మానవతా దృక్పథంతో ముందుకు రావాలని ఇరు దేశాలు స్పష్టం చేశాయి.
అఫ్ఘాన్‌లో తాలిబన్ ప్రభుత్వానికి చైనా, పాక్‌ల మద్దతు ఉందంటూ మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఖతార్‌లో తాలిబన్ ప్రతినిధులతో చైనాకు చెందిన విదేశీ శాఖ మంత్రి వాంగ్ యీ సమావేశమైన అనంతరం పాక్, చైనా సంయుక్త స్టేట్‌మెంట్ రావడం విశేషం. నిజానికి అఫ్ఘాన్‌లో ఆర్థికమాంద్యం, ఆహార కొతర తీవ్ర స్థాయిలో ఉంది. అయితే అది తాలిబన్ దుశ్చర్యల వల్ల ఏర్పడిన సమస్య అని ప్రపంచం మొత్తానికి తెలుసు.