News

మెరుగైన ఆడిటింగ్ విధానాలతో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ

429views
  • ఆర్‌.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి

న్యూఢిల్లీ: క్రియాశీల, ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ కోసం ఆడిట్ నిర్వహణ సమర్థంగా చేపట్టడం అవసరమని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆడిటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. పబ్లిక్ ఫైనాన్స్ ఆడిటింగ్ నిర్వహించడం చాలా ముఖ్యమని అన్నారు. ఆడిటింగ్ ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంబంధిత వర్గాలతో ఆర్​బీఐ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని శక్తికాంత దాస్ వివరించారు.

బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలలో బలమైన ప్రభుత్వ ఫ్రేమ్​వర్క్ ఉండాలని ఆర్​బీఐ ఎప్పటి నుంచో చెబుతోందని పేర్కొన్నారు. సమర్థమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ఇది అవసరమని అన్నారు. మరోవైపు, ఆర్థిక వ్యవహారాలపై తీసుకునే నిర్ణయాలు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే ఉంటాయని తెలిపారు. తప్పుడు సమాచారంతో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ప్రభావానికి కారణమవుతాయని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి