News

జి-20 సమావేశాల‌కు మోదీకి ఆహ్వానం

643views
  • ఖరారైన ఇటలీ, బ్రిటన్ పర్యటన

న్యూఢిల్లీ: ఇటలీ, బ్రిటన్లలో ఈ నెల 29 నుంచి నవంబరు రెండోతేదీ వరకు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్​-26 సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ, బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక భేటీల్లో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు.. ఇటలీలోని రోమ్​లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు.

జి-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇటలీ నుంచి మోదీ.. గ్లాస్​గౌలో జరిగే కాప్​-26 ప్రపంచ నేతల సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్​కు వెళ్లనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటన్​ ప్రధాని బోరీస్ జాన్సన్​.. మోదీని ఆహ్వానించారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ‘ప్రపంచ నేతల సదస్సు’ నవంబరు 1-2 మధ్య జరగనుంది. ఇందులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి. 120 పైగా దేశాల ప్రతినిధులు ఈ భేటీకి హాజ‌రుకానున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి