News

డిగ్రీలో ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా రామచరిత మానస్

704views

భోపాల్‌: ఆర్ట్‌ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సును అభ్యసించే మొదటి సంవత్సరం విద్యార్థులు ‘రామ్‌చరిత్ మానస్‌’ను ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చని మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా.. ‘రామ్ వాన్ గమన్ పథ్’ టూరిజం ప్రాజెక్ట్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో కోటి రూపాయలు కేటాయించింది. రాముని వనవాస మార్గాన్ని భక్తులు వీక్షించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి