
572views
-
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ప్రయోగం
భోపాల్: శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యని సందర్శించాలనుకునే వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన క్విజ్ పోటీలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘రామాయణం’ క్విజ్‌షోను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యని ఉచిత విమాన ప్రయాణం ద్వారా సందర్శించుకోవచ్చు. త్వరలోనే పోటీతేదీలను ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.





