News

చంద్రుడిపై వై-ఫై నెట్‌వ‌ర్క్‌

421views
  • భూమిపై ఇంటర్నెట్ సమస్యల పరిష్కారానికి నాసా ప్రయత్నం

నాసా: చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్ ఏర్పాటుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని కోసం చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌ను పంపించారు. దీని ద్వారా భూమిపై తెలెత్తే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని నాసా గ్లాన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ టెక్నాలజీ ఇంక్యేబేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ క్లీవ్‌ ల్యాండ్‌లో పరిసరాలకు తగ్గట్లు ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌లో చంద్రుడి మీద నుంచి వైఫై సౌకర్యాన్ని అందించేలా బ్లూప్రింట్‌ తయారు చేస్తామని చెప్పారు. అదే సమయంలో చంద్రుడిపై ఉన్న అధిక ఉష్ణోగ్రతలో సైతం చంద్రుడి మీద నుంచి ధూళి, రాళ్లతో పాటు వైఫై నెట్‌ వర్క్‌లకు అక్కడి వాతావరణం అనుకూలిస్తుందా అనే విషయాలపై రీసెర్చ్‌ చేస్తామన్నారు.

‘క్లీవ్‌ల్యాండ్‌’లో దాదాపు 31శాతం  కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ‘గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ పార్ట్‌నర్‌షిప్’ భూమి మీద డిజిటల్ సమస్యకు పరిష్కరించేలా చంద్రుడిని ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో చూడాలంటూ నాసాకి చెందిన గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌ని సంప్రదించారు. దీంతో నాసా గ్లెన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కంపాజ్‌ బృందం.. చంద్రమండలంపై ఉన్న లూనార్‌ సర్ఫేస్‌ ఏరియా ప్రాంతంలోని వైఫై నెట్‌‌వర్క్‌ నుంచి కింద ఉన్న క్లీవ్‌ల్యాండ్‌కు అందించేలా ఇక్కడి భూ వాతావరణం ఎంతమేరకు సహకరిస్తుందనే అంశంపై విశ్లేషణ జరిపినట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి