News

బంగ్లాదేశ్‌లోని హిందువుల‌పై ఆగ‌ని దాడులు

692views
  • ఇళ్ళ‌ను త‌గుల‌బెట్టిన దుండ‌గులు

ఢాకా: బంగ్లాదేశ్‌లో వరుసగా అయిదో రోజు కూడా హిందువుల మీద, ఆలయాల మీద దాడులు జ‌రుగుతునే ఉన్నాయి.  ఆదివారం (అక్టోబర్ 17) రంగ్‌పూర్ డివిజన్‌లోని పిర్గంజ్ ఉపజిల్లాలోని 20 హిందూ గృహాలను తగలబెట్టారు. బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ (BHUC) ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిపింది. “రంగ్‌పూర్ పిర్గంజ్‌లో హిందువులపై దాడి జరిగింది. దేశవ్యాప్తంగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్‌లో హిందువులు మనుగడ సాగించడం కష్టమవుతుంది” అంటూ ట్వీట్ చేసింది. హిందువుల ఇళ్ళు తగులబడుతున్న ఫోటోలను కూడా ట్వీట్ చేశారు.

నౌఖాలీ జిల్లాలో ఇస్కాన్ దేవాల‌యంపై దుండ‌గులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. భ‌క్తుల‌పైనా దాడి చేశారు. గాయ‌ప‌డిన భక్తుల ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. దసరా సందర్భంగా ఇస్కాన్ ఆలయం, భక్తులపై 200 మందికి పైగా దుండగులు దాడి చేశారు. హింసాత్మక దాడిలో ముగ్గురు భక్తులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. 144 సెక్షన్ విధించిన చౌముహాని ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి