News

జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్‌ కమాండర్ కాల్చివేత‌!

36views

న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేసింది.

పుల్వామా జిల్లాలోని అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలోని తిల్వాని మొహల్లా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదిని అంతం చేసినట్టు ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ పోలీస్, CRPF , ఇండియన్ ఆర్మీ సంయుక్త ఆపరేషన్ సమయంలో అతను మరణించాడు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆ ప్రాంతంలో మరిన్ని బలగాలను పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

మూడు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగడం ఇది ఆరోసారి. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మంగళవారం పోషియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్‌ఈటీతో సంబంధాలున్న ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి