News

లడాఖ్‌లో ‘దుమ్ము’ లేపుతున్న యుద్ధ ట్యాంకులు

695views

తూర్పు లడాఖ్‌: మావో చైనా ఆట కట్టించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే తూర్పు లడాఖ్‌లోని నియంత్రణ రేఖ వద్ద హిందుస్థాన్‌ కొత్త ఆయుధాలను ఎక్కుపెట్టింది. చైనా సరిహద్దులో ఉన్న లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ వద్ద తొలిసారి కే9- వజ్రా హోవిట్జర్‌ యుద్ధ ట్యాంకులను ఆర్మీ మోహరించింది. కే9-వజ్రా గన్‌ సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శుత్రు లక్ష్యాలను ధ్వంసం చిల్చీచెండాడుతుంది. కే9-వజ్రా హోవిట్జర్‌ చెందిన రెజిమెంట్‌ను మొత్తాన్ని లడాఖ్‌లో మోహరించినట్టు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే వెల్లడిరచారు.

కే9 వజ్రా ఆయుధాలు హై ఆల్టిట్యూడ్‌ ఏరియాల్లోనూ పనిచేస్తాయని తెలిపారు. ఫీల్డ్‌ ట్రయల్స్‌, యుద్ధ సమయంలో హోవిట్జర్‌ గన్నులు చాలా సక్సెస్‌ రేటును చూపించినట్టు నరవాణే వివరించారు. కే9 రెజిమెంట్‌ను పూర్తిగా మోహరించడం వల్ల కలిగే లాభాలను మనోజ్‌ ముకుంద్‌ వివరించారు. గత ఆరు నెలల నుంచి లడాఖ్‌లో పరిస్థితి ప్రశాంతంగా నరవాణే తెలిపారు. అక్టోబర్‌ రెండవ వారంలో చైనా సైనిక దళాలతో 13వ రౌండ్‌ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ చర్చల్లో దళాల ఉపసంహరణ, పలు అంశాలపై ఏకాభిప్రాయం వచ్చే అవకాశముందని తెలిపారు.

https://twitter.com/i/status/1444191248730902530

అన్ని సమస్యాత్మక ప్రాంతాలను క్లియర్‌ చేస్తున్నామని.. వెల్లడిరచారు. చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన, ఉద్రికత్త పరిస్థితులు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈస్ట్రన్‌ లడఖ్‌ తదితర ప్రాంతాల్లో చైనా తన సైన్యాన్ని పెంచిందని ఇది కొంత ఆందోళనకరమైన అంశమని నరవాణే తెలిపారు. కాగా, ప్రస్తుతం యుద్ధట్యాంకులు అక్కడ ‘దుమ్ము’ లేపుతున్నాయి. అవసరమైతే ‘దమ్మూ’ చూపెడతాయని సైనికులు దేశానికి భరోసా ఇస్తున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి