
ఉత్తరాఖండ్: టెహ్రీ ఆనకట్ట సమీపంలో నిర్మించిన అక్రమ మసీదును ఎట్టకేలకు అధికారులు తొలగించారు. తెహ్రీ డ్యామ్‌కు సమీపంలో ఉన్న ఖండ్-ఖలా కోటి కాలనీలోని అక్రమ మసీదును గురువారం అధికారులు కూల్చివేశారు. ఇటీవల, మసీదు కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా వెలుగులోకి తెచ్చింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న కార్యకర్త అక్షత్ బిల్జ్వాన్ మీడియాతో మాట్లాడుతూ మీడియా కవరేజ్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందన్నారు.
మీడియా వెలుగులోకి తేవడంతో Remove TehriMosque అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అక్రమ మసీదును తొలగించాలన్న స్థానికుల డిమాండ్‌ని నెటిజన్లు స్పందించారు. ఈ కేసులో వేగంగా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని ట్యాగ్ చేశారు.
అక్షత్ ఓపెన్ ఇండియా మీడియాకి ఫోన్ చేసి మసీదు కూల్చివేస్తున్నట్టు తెలిపారు. అతను కూల్చివేత ప్రక్రియ వీడియోలను కూడా పంపించాడు. దీనిలో 20 ఏళ్ళుగా అక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణం ఆ స్థలం నుండి తొలగించారు. ఈ అక్రమ నిర్మాణం ప్రభుత్వ భూమిని ఆక్రమించింది. ఇంకా, దీనిపై స్థానికులు చాలాకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
blob:https://www.facebook.com/21b83aa8-d0af-4d0f-9ade-ef72c2252998
అక్షత్, తన వీడియో సందేశంలో ఈ కేసులో మద్దతు పలికిన భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్‌తో సహా అన్ని హిందూ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ మసీదుపై చర్యలు తీసుకున్నందుకు ఆయన పరిపాలనకు కృతజ్ఞతలు తెలిపారు. అక్షత్ తన సందేశంలో, ‘ఈ ప్రాంతంలోని ముస్లిం సమాజాన్ని అక్రమ నిర్మాణాన్ని తొలగించడంలో వారు అందించిన సహకారానికి నేను కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.
తెహ్రీ డ్యామ్ అక్రమ మసీదు కేసు ఇదీ…
2000ల ప్రారంభంలో ఆనకట్టను నిర్మిస్తున్న కంపెనీ(జేపీ) ముస్లిం కార్మికుల కోసం తాత్కాలిక మసీదును నిర్మించింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, కంపెనీ, కార్మికులు వెళ్లిపోయారు, కానీ తాత్కాలిక మసీదు తొలగించలేదు. స్థానిక నాయకులు, హిందూ సంస్థలు, స్థానికులు గతంలో అనేకసార్లు మసీదుకు వ్యతిరేకంగా తమ స్వరం వినిపించారు, కానీ నిర్మాణాన్ని తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్థానికులు నమాజ్ రోజుల్లో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్తున్న బాలికలను వేధిస్తున్నట్టు అనేక సంఘటనలు రుజువు చేశాయి.
సెప్టెంబర్ 2021 మొదటి వారంలో, అక్షత్, హిందూ సంస్థల నేతృత్వంలో స్థానికులు మసీదుకు వ్యతిరేకంగా నిరసనలను ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, భూమిని కలిగి ఉన్న పర్యాటక శాఖ ఇప్పటికే తనిఖీలు నిర్వహించాయి. అక్రమ మసీదును తొలగించాలని ఆదేశించడం ఇక్కడ గమనార్హం. తాత్కాలిక దుకాణాలు మొదలైన ప్రాంతంలోని అన్ని ఇతర అక్రమ నిర్మాణాలు ఇప్పటికే తొలగించారు. కానీ అక్రమ మసీదు జోలికి పోలేదు. స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఆశ్చర్యంగా మసీదుకు చెందిన వారు ఉత్తరాఖండ్ మైనారిటీ కమిషన్‌కు దరఖాస్తు చేశారు.
blob:https://www.facebook.com/14286457-ca93-47cc-9427-f991ec9c98bb
మైనారిటీ కమిషన్ స్థానిక అధికారులను పిలిచింది. కూల్చివేత ఉత్తర్వులను నిలిపివేసింది. సెప్టెంబర్ 25న, SDM (ఉన్నతాధికారి) నిరసనకారులను కలుసుకుంది. భూమిని కలిగి ఉన్న టూరిస్ట్ డిపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని చట్టవిరుద్ధంగా భావించినందున వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏది ఏమయినప్పటికీ, మైనారిటీ కమిషన్ ప్రమేయం ఉన్నందున, నిర్మాణాన్ని తీసివేయడానికి స్థానికులు వేచి ఉండాల్సి వస్తుందనే వాస్తవాన్నిSDM కూడా పేర్కొంది.
ఈ సమస్య మీడియాలో కవర్ కావడంతో జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో నెటిజన్లు లేవనెత్తారు. చట్టవిరుద్ధ నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియలో రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోందనే ప్రశ్నలు అడిగారు.
Source: Opindia





