
-
కాబూల్ యూనివర్సిటీలో మహిళలకు ప్రవేశం లేదు
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ ప్రాంతం అనాగరిక కాలానికి తిరిగి వెళ్ళినట్టయింది. ఆ దేశంలో తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. కాబూల్ విశ్వవిద్యాలయం కొత్త ఛాన్సలర్ సోమవారం (సెప్టెంబర్ 27) మహిళలను బోధకులుగా లేదా విద్యార్థులుగా అర్హులు కారని, వీరిని సంస్థ నుంచి నిరవధికంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.
‘అందరికీ నిజమైన ఇస్లామిక్ వాతావరణం అందించనంత వరకు, మహిళలు విశ్వవిద్యాలయాలకు లేదా పనికి అనుమతించబడరు. ఇస్లాం మొదటిది’ అని కాబూల్ యూనివర్సిటీ ఛాన్సలర్ మొహమ్మద్ అష్రఫ్ ఘైరత్ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
1990లలో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి నిషేధాలు తెరపైకి వచ్చాయి. ఒక మగ బంధువుతో పాటు మహిళలు మాత్రమే బహిరంగంగా అనుమతించబడ్డారు. అలా ఉండని పక్షంలో శిక్షకు గురయ్యారు. ఇంకా, పాఠశాల ముఖం చూడలేదు.
‘ఎటువంటి ఆశ లేదు, మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ కుప్పకూలిపోతోంది’ అని కాబూల్ యూనివర్శిటీ జర్నలిజం స్కూల్‌లో లెక్చరర్‌గా ఉన్న ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ మాజీ అధికార ప్రతినిధి హమీద్ ఒబైదీ అన్నారు. ‘అంతా నాశనమైంది.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు కాబూల్ విశ్వవిద్యాలయానికి తిరిగి రాలేరని మిస్టర్ ఘైరత్ చేసిన ప్రకటన వివాదానికి దారితీయకుండా ఉండేందుకు తాలిబాన్ ప్రధాన ప్రతినిధి, జబిహుల్లా ముజాహిద్ ప్రయత్నించారు. ‘ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు’ అని మాత్రమే అన్నారు.
Source: Organiser