
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో ఓ లవ్ జిహాదీ కేసు నమోదైంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతికి అఫ్తాబ్ అనే ఓ ముస్లిం యువకుడు ఇన్‌స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ముస్లిం అబ్బాయి పేరు మీద రిక్వెస్ట్ రావడంతో.. ఆ యువతి యాక్సెప్ట్ చేయలేదు. ఆ యువకుడికి పరిస్థితి అర్థమయ్యి.. రాహుల్ పేరు మీద ఫేక్ ఐడీ క్రియేట్ చేసి రిక్వెస్ట్ పంపాడు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది.
అప్పటినుంచి వారిద్దరూ చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఓ రోజు బయట కలుద్దామని అఫ్తాబ్ కోరగా.. ఆమె సరేనని బయటికి వెళ్లింది. ఆ యువకుడు చెప్పిన ప్రాంతానికి వెళ్తే గానీ ఆ అమ్మాయికి అసలు విషయం తెలియలేదు. తాను ఇన్ని రోజులు చాటింగ్ చేసింది అఫ్తాబ్‌తో అని తెలిసి బాధపడిరది. అప్పటినుంచి అతడితో చాటింగ్ చేయడం, మాట్లాడడం మానేసింది. కానీ అఫ్తాబ్ ఆ యువతిని వదలలేదు.
సోమవారం మాక్సి రోడ్‌లో వెళ్తున్న ఆ యువతిని వ్యాన్‌లో వచ్చి అఫ్తాబ్ కిడ్నాప్ చేశాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా.. ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. స్థానికులకు అరుపులు వినపడడంతో వ్యాన్‌ను ఆపారు. పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి అఫ్తాబ్‌ను అరెస్టు చేశారు. యువతి తల్లిదండ్రులు, హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలతో కలిసి చిమంగంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అఫ్తాబ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Source: ABN





