News

భారత్‌ సరిహద్దు వెంబడి చైనా కొత్త సైనిక స్థావరాలు

458views

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దు వెంట చైనా పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని కోసం కొత్తగా శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాలను నిర్మిస్తోంది. తషిగాంగ్, మాంజా, హాట్‌ స్ప్రింగ్స్, చురుప్‌సహా మరి కొన్ని ప్రాంతాల్లో వీటిని సిద్ధంచేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సైనిక మోహరింపుతోపాటు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ తాము వినియోగించని భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని యోచిస్తోంది. గల్వాన్‌ ఘర్షణల తర్వాత మరిన్ని ‘ఫార్వర్డ్‌’ ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించనుంది. ‘ గతంలో తిష్ఠ‌వేయని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటమనేది చైనా సైనికులకు కష్టమైన పని. చైనా సేనలకు కొత్త కష్టం వచ్చి పడింది’ అని భారత సైన్యాధికారులు వ్యాఖ్యానించారు. భారత్‌ సైతం చైనాకు దీటుగా స్పందిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.