
-
ఒకటిన్నర క్వింటాళ్ల సరుకు స్వాధీనం
-
ఇద్దరి అరెస్టు
మధుర: మధురలోని శ్రీకృష్ణుడి జన్మస్థలం చుట్టూ యోగి ప్రభుత్వం మాంసం, మద్యం అమ్మకాలను నిషేధించింది. అయినా కొంతమంది ముస్లిం వ్యాపారులు సీఎం ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. బుధవారం పోలీసులు అదే ప్రాంతం నుండి ఒకటిన్నర క్వింటాళ్లకు పైగా మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు సూపరింటెండెంట్ ఎం.ప్రకాష్ సింగ్, అతని బృందం గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక వ్యాన్‌ను అడ్డగించారు. దానిని సోదా చేయగా, అందులో ఉన్న ఒకటిన్నర క్వింటాళ్లకు పైగా మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ మాంసం నిషేధిత జన్మభూమి ప్రాంతంలో రహస్యంగా విక్రయించారు. ఈ కేసులో రాయ నగర్ పంచాయితీ కౌన్సిలర్ అయ్యూబ్, అతని సహచరులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, శ్రీ కృష్ణ జన్మభూమి వద్ద ఉన్న గోవింద్ నగర్ ప్రాంతంలో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇక్కడి ముస్లింలు రహస్యంగా మాంసాన్ని విక్రయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Source: panchjanya





